విశాఖలో "ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం"నకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూమంత్రి సత్యప్రసాద్ కు వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు కోరారు. గురువారం విశాఖకి వచ్చిన మంత్రిని ఒక హోటల్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనేక సామాజిక వర్గాలకు విశాఖలో స్థలాలు కేటాయించారని, వెలమ సంక్షేమ సంఘానికి కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.