కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామా పరంపర

72చూసినవారు
కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామా పరంపర
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వేపాడ మండలం ఎన్ కె ఆర్ పురం, చిన్న గుడిపాల సచివాలయం పరిధిలో శనివారం 22 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అనంతరం వారి రాజీనామాల లేఖలను సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పించారు. ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ వాలంటీర్లకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేయడం విధితమే.