ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. శనివారం ఎస్. కోట మండలం గోపాలపల్లిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ల్యాబ్లో సైతం వైద్య
పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరరావు వైస్ ఎంపీపీ సుధారాజు తదితరులు పాల్గొన్నారు.