శృంగవరపుకోట మండలంలో స్థానిక పెద్ద ఖండెపల్లి గ్రామ సచివాలయం వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో ఆ గ్రామ పారిశుద్ధ్య కార్మికులు అయినటువంటి టీ. బంగారయ్య, దాలిస్, మరియు ఎం చిన్నయ్య లకు ఆ గ్రామ సర్పంచ్, సచివాలయం సిబ్బంది సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాల్ల వెంకట్ రమణ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలు వెల కట్టలేనివని వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని సర్పంచ్ సభలో పేర్కొన్నారు.