ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వర్షాలు, వరదలు కారణంగా చాలామంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వరద భాదితులకు సహాయార్థమై విజయనగరం లో చలపతి పాఠశాల విద్యార్థులు వారికి తోచిన మేరకు సహాయం చేసారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీ గజపతి కి 50 వేల రూపాయల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.