అన్ని దానములలో అన్నదానం మిన్న.. వనమిత్ర కృష్ణ దాస్

55చూసినవారు
అన్ని దానములలో అన్నదానం మిన్న.. వనమిత్ర కృష్ణ దాస్
బొబ్బిలి పట్టణం ఇందిరమ్మ కాలనీ యానాదుల వీధిలో శనివారం వనమిత్ర కృష్ణ దాస్ నిరుపేదలకు, వృద్ధులకు, పిల్లలకు ఆహారం ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానములలో అన్నదానం మిన్న అనీ, అన్నదానం అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం అని, ఇది గొప్పదానమని అన్నారు. వనమిత్ర కృష్ణ దాస్ చేస్తున్న ఇలాంటి గొప్ప కార్యక్రమాల్ని పలువురు సామాజికవేత్తలు పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్