బొబ్బిలి సమీపంలో లచ్చయ్యపేట ఎన్సీఎస్, బీమసింగి సహకార చక్కెర కర్మాగారాలు తెరచుకోక పోవడంతో చెరకు రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నా రు. క్రషింగ్ సీజన్ నేపథ్యంలో చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. గతంలో మాదిరిగానే చెరకును సంకిలి ఫ్యాక్టరీకి తరలించుకోవాల్సి వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్కెర కర్మాగారాల విషయంలో ఎన్నో హామీలు గుప్పించారు. కర్మాగారాలైతే తెరుచుకోలేదు. రైతులకు అవస్థలు తప్పలేదు.