బొబ్బిలి మున్సిపల్ కార్మికుల స్థలాన్ని ఆదివారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పరిశీలించారు. కార్మిక కుటుంబలకు అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదన్నారు. కార్మికులు ఇరుకు గదుల్లో 2, 3 కుటుంబాలు జీవిస్తున్నాయని, ఇది అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. అటువంటి కార్మికులకు ప్రభుత్వమే స్థలం కొని, వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది పోయి ఆ స్థలంలో మురికి నీరు శుద్ధి ప్లాంట్ లు కట్టాలనుకోవడం అన్యాయమని అన్నారు.