బొబ్బిలి మండలం జగన్నాథపురంలో క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఆదివారం గ్రామ సమీపంలోని క్రికెట్ పోటీలను సర్పంచ్ ప్రతినిధి బొద్దల సత్యనారాయణ ప్రారంభించారు. క్రీడలపై యువతకు ఆసక్తి పెంపొందించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజేతలకు సంక్రాంతి రోజున బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.