పాత బొబ్బిలి రోడ్డులో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం అన్నదానం నిర్వహించారు. అన్నదానానికి బొబ్బిలి, పాత బొబ్బిలికి చెందిన సుమారు మూడు వేల మంది భక్తులు హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త బేవార సురేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదానం, పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.