అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్బంగా బొబ్బిలి నియోజకవర్గం లో ఉన్న పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) అన్నారు. బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో సాగునీటి వనరులన్నింటినీ గాడిలో పెట్టాల్సిన అవసరాన్ని శాసనసభ దృష్టికి తీసుకెళ్తాని, లోచర్ల, రాముడువలస తోటపల్లి ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభమయ్యేలా ఒత్తిడి తెస్తానని ఎమ్మెల్యే తెలిపారు.