నీటి సంఘాల ఎన్నికలకు గ్రామ రెవెన్యూ అధికారులు సిద్ధం కావాలని బొబ్బిలి తహశీల్దార్ ఎం. శ్రీను సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో నీటి సంఘాల ఎన్నికలపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. బొబ్బిలి రూరల్, పట్టణ పరిధిలో 13 చిన్న నీటిపారుదల చెరువులు, 5 మీడియం ఇరిగేషన్ ఆయకట్టు సంఘాల రైతుల ఓట్ల నమోదుకు గ్రామ రెవెన్యూ అధికారులంతా సిద్ధం కావాలన్నారు. సమావేశంలో ఎన్నికల ఉప తహశీల్దార్ గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.