రామభద్రపురం మండల కేంద్రంలో గల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో సుమారు36 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 5 గోదాములు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెన ఔషది(జనరిక్ మెడికల్ షాప్)ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు.