బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం హైస్కూల్ ప్రహారీ చుట్టూ ఉన్న భూమిని కొంత మంది కబ్జా చేశారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని జనసేన బొబ్బిలి నియోజకవర్గ ఇంఛార్జి డా. గిరడ అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి కబ్జాచేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే జనసేన తరఫున హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలియజేశారు.