బొబ్బిలి మండలంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు మంజూరైన సీఎం సహాయనిది చెక్కులను బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అందజేశారు. బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన మావిరెడ్డి సూర్యచంద్రరావుకు రెండు లక్షల 50 వేల రూపాయలు, కొండదేవుపల్లి గ్రామానికి చెందిన బోరపురెడ్డి ప్రమీల కు రెండు లక్షల రూపాయలు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైనట్లు ఆయన తెలిపారు.