విశాఖపట్నంలోని అచ్చుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చీపురుపల్లి నియోజకవర్గం అర్తమూరు గ్రామానికి చెందిన మహాంతి నారాయణరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గురువారం పరామర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోటి రూపాయలు చెక్కును అందచేసి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కళావెంకటరావు మీడియాతో మాట్లాడుతూ అచ్చుతాపురం సెజ్ లో జరిగిన ఫార్మా ప్రమాదం దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు.