చీపురుపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అమోదించిందని భారత రాజ్యాంగాన్ని రాయడానికి ముషాయిదా కమిటీ అధ్యక్షులుగా డా. బి. ఆర్. అంబేద్కర్ వ్యవహరించారాని అన్నారు.