చీపురుపల్లి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కె ఆర్ రాజేశ్వరి జిల్లాపరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ను విజయనగరంలో గల తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. చీపురుపల్లి ప్రాజెక్టు బాధ్యతలను స్వీకరించినట్లు తెలియజేసారు. అనంతరం మండల అధ్యక్షురాలు తాడ్డి కృష్ణవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాడ్డి వేణుగోపాల రావు, డిసిఎంఎస్ మాజి అధ్యక్షులు శిరువూరి వెంకటరమణరాజు, మాజి జడ్పీటిసి కోట్ల వెంకటరావులను మర్యాదపూర్వకంగా కలసి పిఒ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఈమెతో పాటు సీనియర్ అసిస్టెంట్ రాజు ఉన్నారు.