చీపురుపల్లి కేంద్రంలో ఉన్న కోర్టు భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో విషయం తెలుసుకుని నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబందించిన స్థలాన్ని సోమవారం శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు ఆధ్వర్యంలో టీడీపి శ్రేణులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, త్వరలోనే నూతన బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టి పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.