యువత జాతీయ సమైక్యతా భావాలను అలవర్చుకోవాలి...

83చూసినవారు
యువత జాతీయ సమైక్యతా భావాలను అలవర్చుకోవాలి...
ఆశయ యూత్ అసోషియేషన్ భారత ప్రభుత్వం సంస్థ నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో చీపురుపల్లి అగ్రహారం గ్రామంలో ప్రజా గ్రంధాలయం ఆవరణలో విద్యార్థులచే సద్భావనా దివాస్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ ఫోటోకి పుష్పాలతో అలకరణ చేసారు. ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ అధ్వర్యంలో జరిగింది. స్వర్గియ మాజీ ప్రథాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా సధ్బావనా దివాస్ కార్యక్రమం లో భాగంగా ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ...రాజీవ్ గాంధీ భారతదేశంలో మత సామరస్యం, శాంతి, జాతీయ సమగ్రతను ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ప్రపంచానికి మంచి రాయబారిగా ప్రసిద్ది చెందారు. ఇండియా బోర్డర్ లో కుల మతాలూ బేధం లేకుండా అందరూ భారతీయుల సిద్ధాతం అని భారతదేశంలో ఎవరైనా హింసను విడి అహింస మార్గాలు ఎంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ సభ్యులు హేమంత్, గ్రంథాలయం పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్