గజపతినగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు

1579చూసినవారు
గజపతినగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు
విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 4 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, 2 సార్లు ఇండిపెండెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. గజపతినగరం నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి బొత్స అప్పలనరసయ్య, టీడీపీ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నుండి దోలా శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. గెలుపు తమదంటే తమదని ధీమాగా ఉన్నారు. చీపురుపల్లిలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనున్నది.

సంబంధిత పోస్ట్