బొండపల్లి మండలం అంబటి వలస గ్రామ సమీపంలో శనివారం గజపతినగరం సిఐ జి ఏ వి రమణ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఐ మహేష్ తదితర పోలీస్ సిబ్బంది స్టాపర్స్ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి కావడంతో వాహనాలు రద్దీ దృష్ట్యా ప్రమాదాల నివారించేందుకు స్టాపర్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. వాహనాలు అతివేగంతో నడపొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు అనుసరిస్తూ ప్రయాణం చేయాలని కోరారు.