దత్తిరాజేరు: జీవో నెంబర్ 7 ద్వారా జీతాలు చెల్లించాలి

80చూసినవారు
దత్తిరాజేరు: జీవో నెంబర్ 7 ద్వారా జీతాలు చెల్లించాలి
2020 తర్వాత విధుల్లోకి చేరిన 104 డీఈఓ, పైలట్లకు జీవో నెంబర్ 7 ద్వారా జీతాలు చెల్లించాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం దత్తిరాజేరు డిప్యూటీ తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ లకు వినతిపత్రం అందజేశారు. గత మూడు నెలల నుండి జీతాలు లేక 104 ఉద్యోగులు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. జీతాలు సక్రమంగా, సకాలంలో చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్