జయతి గ్రామానికి చెందిన గేదెల సత్యం(42) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం విజయనగరం మహారాజ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో సోమవారం రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర జయతి గ్రామానికి వచ్చి ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈయన వెంట ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైసీపీ అధ్యక్షులు రాయపల్లి రామారావు, త్రినాధ, ఈశ్వరరావు, రత్నాకర్, పొట్టంగి దుర్గ ఉన్నారు.