గజపతినగరం ఎఫ్.హెచ్.ఆర్.సి జిల్లా సభ్యులుగా గౌరీ నియామకం

72చూసినవారు
గజపతినగరం ఎఫ్.హెచ్.ఆర్.సి జిల్లా సభ్యులుగా గౌరీ నియామకం
ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విజయనగరం జిల్లా సభ్యులుగా గజపతినగరం మండలం జిన్నాంకు చెందిన పొగిరి గౌరికి బాధ్యతలు అప్పగిస్తూ ఎఫ్.హెచ్.ఆర్.సి రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు బుధవారం గజపతినగరంలో ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో గౌరి నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్