జనసేన విజయోత్సవ వేడుకలు

50చూసినవారు
రాష్ట్రంలో కూటమికి ఘనవిజయం చేకూర్చినందుకు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. మంగళవారం రాత్రి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, మాజీమంత్రి పడాల అరుణ స్వగృహం వద్ద కేకు కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేశారు. అదేవిధంగా జనసేన పార్టీకి అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు (జగన్), పడాల శరత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్