మెంటాడ మండలంలో శుక్రవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు 33 కెవి లైన్ మెయింటెనెన్స్, చెట్లు తొలగింపు సందర్భంగా విద్యుత్ నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శంకర్రావు తెలిపారు. దీని కారణంగా ఇద్దనవలస, బడేవలస, చల్లపేట, మెంటాడ, కొంపంగి, పిట్టాడ గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.