గజపతినగరం: అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామానికి విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.