జామి: 300 కేజీల పిడిఎఫ్ బియ్యం పట్టివేత
జామి మండలం మాధవరాయ మెట్ట గ్రామానికి చెందిన దాడి తాత అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచిన 300 కేజీల పిడిఎఫ్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు బుధవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన పై 6 ఏ కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని జామి తాసిల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యాన్ని కొనుగోలు చేసినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.