నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంతవరకూ క్యాన్సర్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.