కురుపాం: దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి
మన్యం జిల్లా, జియమ్మవలస మండలంలోని టి.కె.జమ్ము గ్రామంలో శ్రీబోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో బుధవారం కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జగదీశ్వరి దంపతులకు గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బోండి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి. టి. మండ, చలపతిరావు, శంకర్ రావు, మన్మధ, శ్రీను, భారతమ్మ, బుజ్జి, పాల్గొన్నారు.