జియ్యమ్మవలస మండలంలోని బాసంగి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు. కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి ఉంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిర్వాసిత గ్రామం కాబట్టి పారిశుధ్యం పై పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.