టిఫిన్ షాప్ ను ఢీకొన్న బొలెరో వాహనం

565చూసినవారు
కురుపాంలో బొలెరో పికప్ వాహనం టిఫిన్ దుకాణాన్ని ఢీకొని కాలువలోకి దూసుకువెళ్లిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పార్వతీపురం నుండి కేదారిపురం వెళ్తుండగా డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ షాప్ ను ఢీకొని కాలువాలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్