గెలిపిస్తే వంతెన పూర్తి చేస్తాం: సీపీఎం అభ్యర్థి

66చూసినవారు
గెలిపిస్తే వంతెన పూర్తి చేస్తాం: సీపీఎం అభ్యర్థి
సీపీఎం అభ్యర్థిని గెలిపిస్తే పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేసి గిరిజన ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. రమణ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వంతెనను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వంతెన నిర్మాణంపై ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వైఖరి చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్