గుమ్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన కందికొత్తల ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం భోజనాల సమయంలో చెముడుగూడకు చెందిన ఎన్. రమేష్ సాంబారు టబ్బులో పడి గాయాలపాలయ్యాడు. ఆయన విజయనగరం జిల్లా ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి బుధవారం మృతి చెందినట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. అతడికి భార్య శ్రీదేవి(గర్భిణి), ఇద్దరు కుమారులు ఉన్నారు.