కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలోని వాడపుట్టి పాఠశాల ఉపాధ్యాయుడు ఊయక కూర్మయ్య (55) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. డిప్యుటేషన్ పై గెద్రజోలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన స్వగ్రామం కొమరాడ మండలం పూజారిగూడ. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన మృతికి ఎంఈవో చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.