ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ రామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువఝాము నుంచే బారులు తీరారు. ఉత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కొండచుట్టూ స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. భక్తుల రామ నామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది.