ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో గల మత్స్యకారుల సమస్యలను సభాపతి దృష్టికి తీసుకువెళ్లారు. తీరప్రాంత ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.