నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలో పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా తయారు చేసిన శ్రీ దుర్గమ్మ కొలువైంది. స్థానికంగా ఉన్న యువత, మహిళలు 150 కిలోలతో శనివారం రూపొందించిన అమ్మవారి విగ్రహాన్ని మండపంలో ప్రతిష్టించారు. ప్రతిష్టకు ముందు దుర్గమ్మ విగ్రహాన్ని గ్రామ వీధుల్లో మేళ, తాళాలతో ఊరేగించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది అవతారాలుగా అలంకరిస్తామని నిర్వాహకులు తెలిపారు.