భామిని మండలంలోని అలికాం-బత్తిలి రోడ్డు గురండి కూడలి వద్ద రోడ్డు మధ్యలో ఓ లారీ దిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు బురదమయంగా మారింది. శుక్రవారం ఒడిశా నుంచి వస్తున్న లారీ బురదలో ఇరుక్కుపోయింది. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రయాణికులు రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి వాహనాలు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేశారు.