పాలకొండలో ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

82చూసినవారు
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడుగా పేరొందిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను పాలకొండలో సోమవారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతికే అంతర్జాతీయంగా వన్నె తెచ్చిన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశ నటులకు సాటి వేరే ఇంకెవరూ ఉండరని ఎన్టీఆర్ యూత్ ఫ్యాన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రామ్ అన్నారు.

సంబంధిత పోస్ట్