నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకింగుల్లో ఆశావహ(ఆస్పిరేషనల్) జిల్లాగా పార్వతీపురం నిలిచినందున రూ. 3 కోట్లు నిధులు విడుదలయ్యాయని, ఆ నిధులతో త్వరలో పార్వతీపురంలో ఇన్నోవేషన్ హబ్ ను నిర్మించుకోనున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విద్యార్థులకు తెలిపారు. స్థానిక డీవివిఎం స్కూల్ ఆవరణలో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన ముగింపు కార్యక్రమం విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.