గత సెప్టెంబర్ లో ఉమ్మడి విజయనగరం పార్వతీపురం జిల్లాకు సంబంధించి పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై దర్యాప్తు జరపాలని.. జాతీయ మానవ హక్కుల కమిటీ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు వంగల దాలినాయుడు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరగాయని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ కె హేమలతకు వినతిపత్రం అందజేశారు.