అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యా బోధనను అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. పార్వతీపురం మండలం డోకిశీల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు సంబందించిన మందులను, శానిటైజేషన్ సంబంధించిన సామాగ్రి స్టాక్ ను పరిశీలించారు.