పార్వతీపురం మండలం వెంకట రాయుడు పేట గ్రామాన్ని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శనివారం ఉదయం సందర్శించారు. జట్టు స్వచ్ఛంద సంస్థ గ్రామంలో గోశాల ఏర్పాటు చేయుటకు తద్వారా గ్రామాన్ని మోడల్ గ్రామంగా చేయుటకు నిర్ణయించింది. ఈ మేరకు గ్రామంలో పరిస్థితులు తదితర అంశాలను సంబంధిత ప్రతినిధులతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీలో పాల ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయాలన్నారు.