పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ డెప్పివలన గ్రామంలో నిర్మిత మవుతున్న వన్ ధన్ వికాస్ కేంద్రాన్ని (వి. డి. వి. కె) వినియోగించుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ మహిళలకు పిలుపునిచ్చారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా శుక్రవారం డోకిశీల గ్రామాన్ని ఆయన సందర్శించారు. అదే పంచాయితీలో నిర్మితమవుతున్న వి. డి. వి. కెను ఆయన సందర్శించి, ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు.