పదవ తరగతి పరీక్షల్లో విజయ దుందుభి మోగించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె హేమలత అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ కేజీబివి పాఠశాల ప్రత్యేక అధికారిగా శనివారం ఆర్డిఓ సందర్శించారు. ఇష్టంతో చదివితే విషయ అవగాహన సులభంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆసక్తి, బోధన, అభ్యసన తదితర అంశాలను పరిశీలించారు. తరగతులు ఏకాగ్రతతో వినాలని, సందేహాలు వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.