విజయనగరం: బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మారుద్దాం
By k.chetan 67చూసినవారుబహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు సిద్దం కావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ శుక్రవారం పిలుపునిచ్చారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దశలవారీగా అమలు చేయనున్నట్లు ఆయన వెళ్లడించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు శనివారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించి బుధవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.