అక్షర యోధునికి అశ్రు నివాళి

72చూసినవారు
అక్షర యోధునికి అశ్రు నివాళి
అక్షర యోధుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి విజయనగరం జర్నలిస్టులు అశృనివాళి అర్పించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం ప్రత్యేకంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలాంకృతం చేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పత్రికా, మీడియా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్