రైతులు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో మార్కెటింగ్ చేసే విదంగా ఎదిగి లాభాలను పొందాలని సాలూరు వ్యవసాయ సంచాలకులు ఎం మధుసూదన్ రావు కోరారు. బుధవారం పాచిపెంట మండలం కోస్టువలస, మంచాడవలస గ్రామాలలో ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ఆహార పంటలను పండించినప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తిని విక్రయించుకొని అధిక లాభాలను పొందవచ్చన్నారు. ఈ దిశగానే ఆలోచనలు సాగిస్తుందని తెలిపారు.